పోతంగల్ ఏప్రిల్ 01: గ్రామ సభల్లో గ్రామస్తుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా స్థానిక అభివృద్ధి, పారదర్శకత సాధ్యమవుతుందని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని తిరుమలపూర్ గ్రామపంచాయతీని బుదవారం సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఎంపీడీవో చందర్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామాల్లో నిర్వహించే గ్రామసభలలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు రైతులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బోయి సాయిదవ్వ, కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.