Energy drinks | కోటగిరి : ఎనర్జీ డ్రింక్ విద్యార్థులు తాగడం వల్ల విద్యార్థులు ఒక చురుకుదనం వస్తుందని, ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల నిత్యం విద్యార్థులు యాక్టివ్ గా ఉంటారని లయన్స్ క్లబ్ కోటగిరి అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గురువారం లయన్స్ క్లబ్ కోటగిరి అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ ఆధ్వరంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రచ్చ గల్లి, మాలివాడా, మీర్జాపూర్ క్యాంప్. కోటగిరి, ఎస్సీ కాలనీ ఇలా అన్ని ప్రాథమిక పాఠశాలలో ఎనర్జీ డ్రింక్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి 300 మంది విద్యార్థులకు ఈ ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఈ ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల మానసిక ఉత్తేజాన్ని పెంచి, ఏకగ్రతను పెంచుతుందన్నారు. దీంతో పాటు విద్యార్థులకు ఎంతో శక్తివంతంగా ఉంటుందన్నారు. ఈ ఎనర్జీ డ్రింకులో అన్ని రకాల పోషకాలు ఉంటాయన్నారు. లయన్స్ క్లబ్ కోటగిరి వారు విద్యార్థులకు ఉచితంగా ఎనర్జీ డ్రింక్ అందించిన లయన్స్ క్లబ్ కోటగిరి వారికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నార్ల సాయి శ్రీనివాస్, కోశాధికారి గోగినేని హనుమంతరావు, పీ అనిల్ కుమార్, పోల అశ్విన్ కుమార్, లయన్స్ క్లబ్ సభ్యులు కూచి సిద్ధూ, జానకిరావు, బర్ల సాయిలు, బీర్కూరు శ్యాం కుమార్, పాకల లక్ష్మణ్, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.