Bhikkanur | చట్టాల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి.. సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి
చట్టాల పట్ల విద్యార్థలు అవగాహన పెంచుకోవాలని కామారెడ్డి జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు.
Bhikkanur | భిక్కనూర్, జూలై 22 : చట్టాల పట్ల విద్యార్థలు అవగాహన పెంచుకోవాలని కామారెడ్డి జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో భిక్కరూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళలు, బాలికలు, విద్యార్థుల భద్రత, చట్టపరమైన హక్కులు, సైబర్ మోసాలు, వేధింపుల నివారణపై బుధవారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి మాట్లాడుతూ బాల్యవివాహాలు, సైబర్ మోసాలు, లైంగిక వేధింపులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బాల్యవివాహం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా 112 అత్యవసర సేవలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోక్సో చట్టం కింద చిన్నారులకు కల్పించిన రక్షణ, బాలికల హక్కులు, ఉచిత న్యాయసేవల గురించి వివరించి, చట్టాలపై అవగాహన పెరగడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజగంగా రెడ్డి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు సంతోష్ రెడ్డి, శ్రావణ్, నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

