బాల్కొండ : పదవ తరగతి విద్యార్థులు ( Tenth Students ) వార్షిక పరీక్షలకు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ఉపాధ్యాయుల మార్గదర్శకాన్ని అనుసరించి, ధైర్యంగా పరీక్షలను రాయాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి (RJD Satyanarayana Reddy) సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన టీ శాట్ బోధనలో పాల్గొన్నారు. విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా విద్యార్థులకు ప్రత్యేక సందేశాన్ని వినిపించారు.
అనంతరం ఆర్జేడీ విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని సూచించారు. విషయ నిపుణులు సబ్జెక్టులలో మార్కులు ఎలా సాధించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పది సిలబస్ పూర్తయినందున ఇకపై సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. క్రమ శిక్షణతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ , ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం ప్రశాంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.