నిజామాబాద్ : ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది.
సకాలంలో బస్సులు రాక గంటలతరబడి వేచిచూడాల్సి వచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ యాజమాన్యం అదనంగా సర్వీసులను నడిపించకపోవడతో సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. –