ఖలీల్‌వాడి, అక్టోబర్ 23: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం నిజామాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు మహా ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు భారీగా తరలివచ్చిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వక పోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఇటీవల బంద్ పాటించినా సర్కారులో చలనం రాలేదన్నారు. నిధులు విడుదల చేయకపోతే ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు బానోత్ రఘురాం, అంజలి, నవీన్‌కృష్ణ, వంశీ, కుషాల్, కార్తిక్, గోదావరి పాల్గొన్నారు.