కామారెడ్డి : జిల్లాలోని బాన్సువాడ ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య ( Suicide) కలకలం రేపుతుంది. హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్థిని ( Inter Student ) అమృత ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్నూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అమృత హాస్టల్లో ఉంటూ ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.
జ్వరం ఉందని కాలేజీకి వెళ్లకుండా ఉదయం హాస్టల్లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం వచ్చిన తోటి విద్యార్థినిలు అమృత ఆత్మహత్య విషయాన్ని హాస్టల్ సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో వారు పోలీసులకు, విద్యార్థిని కుటుంబ సభ్యులకు వివరించారు. కుటుంబ సభ్యులు హాస్టల్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.