Dogs Attack | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో యాద్గర్పూర్ గ్రామంలో దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటన యాద్గార్ పూర్ లో సోమవారం చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కోటపల్లి మండలం యాద్ గార్పూర్ గ్రామంలో ఉదయం ఆరు గంటల సమయంలో దారుతప్పి ఓ జింక గ్రామంలో వచ్చింది.
దీంతో వీధి కుక్కలు ఒక్కసారిగా జింకపై దాడి చేశాయి. ఈ దాడిలో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వీధి కుక్కలను తరిమివేశారు. గాయాల పాలైన జింకను సురక్షిత ప్రదేశంలోకి తీసుకొచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు.
ఘటన కు సంబంధించిన వివరాలు తెలుసుకొని, గాయల పాలైన జింకను కోటగిరి పశు వైద్యశాలకు తరలించారు. స్థానిక వెటర్నరీ డాక్టర్ సురేష్ కుమార్ జింక కు చికిత్స అందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు జింక ను అప్పగించారు. ఈ కార్యక్రమంలో వర్ని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సురేష్, రాజు, గ్రామస్తులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.