Vishwam Diagnostics | కంటేశ్వర్, సెప్టెంబర్ 12 : హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన వ్యుజిపిల్మ్ ఇండియా సంస్థ నిజామాబాద్‌లోని ఖలీల్ వాడి లో ఉన్న విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ లో అత్యాదునిక అమ్యులైట్ ఇన్నోవాలిటీ ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మమ్మోగ్రఫీ (ఎఫ్ఎఫ్ఎఎం) వ్యవస్థను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. విశ్వం డయాగ్నస్టిక్ సెంటర్లో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్యూజిఫిల్మ్ ఇండియా మెడికల్ సిస్టమ్స్ జీవిజన్ బిజినెస్ ఎడ్వైజర్ షన్స్‌కు పొండా మాట్లాడుతూ ప్యూజిఫిల్మ్ ఇండియాలో మన సమాజాలకు సాధికారత కల్పించేలా వైద్యంలో సరికొత్త ఆవిష్కరణలను విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నిజామాబాద్‌లో అమ్యులేట్ ఈన్నోవాలిటీని ఏర్పాటుచేయడం అనేది భారతదేశంలో మహిళల ఆరోగ్య పరీక్షలను బలోపేతం చేయడంలో మరో ముందడుగు అవుతుందని పేర్కొన్నారు.
టైర్-2 నగరాలకు అంతర్జాతీయ స్థాయి మిమ్మోగ్రఫీని తీసుకురావడం ద్వారా మరింతమంది మహిళలు త్వరగా వ్యాధిని గుర్తించే అవకాశాన్ని పొందుతారని, దీంతో ఖచ్చితమైన డయాగ్నసిస్, మెరుగైన వైద్యం అందుతాయని తెలిపారు. తాము చేపట్టిన ‘త్వరగా గుర్తించండి. త్వరగా పోరాడండి’ అని సీఎస్ఆర్ ప్రదారానికి కూడా మహిళల రొమ్ము క్యాన్సర్ పరీక్షల విషయంలో ఇది మద్దతిస్తుందని చెప్పారు. మహిళల ఆరోగ్యం, త్వరగా గుర్తించడం అనే విషయానికి మేం కట్టుబడి ఉన్నామని తెలిపారు.
విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ పెరిడాంటిస్ట్ డాక్టర్ రాసా విజయ్ మాట్లాడుతూ ప్యూజిపిల్స్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా అంతర్జాతీయ స్థాయి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను నిజామాబాద్ ప్రాంతానికి తీసుకురాగలిగామని చెప్పారు. ఈ కొత్త సదుపాయంతో రోగులు అత్యంత నాణ్యమైన చిత్రాలు, తక్కువ రేడియేషన్, అత్యంత సౌఖ్యవంతమైన డయాగ్నస్టిక్ అనుభవం పొందగలరని అని తెలిపారు. నమ్మకమైన, రోగులకు అనుకూలమైని, అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను నిజామాబాద్ వాసులకు అందించాలన్న తమ నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
అత్యాధునిక మమ్మాగ్రఫీ పరిష్కారాలను సమర్థంగా అందించడం ద్వారా మహిళల ఆరోగ్య పరీక్షలను బలోపేతం చేయాలన్న ప్యుజిపిల్మ్ ఇండియా వారి నిబద్ధతను భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందని తెలిపారు. అమ్యులెట్ ఇన్నేవాలిటి పరికరం విశ్వాసం, ఖచ్చితత్వం, ఆవిష్కరణలకు మారుపేరు, వైద్య నిపుణులు తమ రోగుల సమస్యలను త్వరగా గుర్తించడానికి, అత్యున్నత నాణ్యతతో రొమ్ముక్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేకానంద, గైనకాలజిస్ట్ అరుణ, రేడియాలజిస్ట్ విశృత్, డాక్టర్ ముకుంద్, సుదర్శన్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.