ధర్పల్లి, డిసెంబర్ 26 : రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని ప్రాజెక్టు రామడుగు కాలువల నుంచి ఆయకట్టుకు సాగునీటిని ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డితో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వాడుకోవాలని, పంట మార్పిడి విధానం అవలంబించాలని రైతులకు సూచించారు. అనంతరం దుబ్బాక చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్లు చిన్నారెడ్డి, రాజేందర్‌రెడ్డి, నాయకులు సురేందర్‌గౌడ్, పోతరాజు, దాసు, రైతులు పాల్గొన్నారు.
రేకులపల్లి పాఠశాలలో అదనపు తరగతి నిర్మాణానికి భూమిపూజ..
ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ భూమిపూజ చేశారు. అనంతరం రేకులపల్లి గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. 15వ ఆర్థిక సంఘం జడ్పీటీసీ నిధులు రూ. 6 లక్షలతో అదనపు గది నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ రాజేందర్, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సురేందర్‌గౌడ్, పోతరాజు, నాయకులు పాల్గొన్నారు.