Sirikonda | వ్యవసాయ కార్మికుల ఉద్యమ బలోపేతం కోసం రాష్ట్ర మహాసభలు
వ్యవసాయ కార్మికుల ఉద్యమం బలోపేతం కోసమే ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు పిట్ల రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలు కామారెడ్డి లో మార్చి 24, 25 తేదీలల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
Sirikonda | సిరికొండ, మార్చి 14 : వ్యవసాయ కార్మికుల ఉద్యమం బలోపేతం కోసమే ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు పిట్ల రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలు కామారెడ్డి లో మార్చి 24, 25 తేదీలల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం లో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు, కార్మికులు అంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపు ఉందని, పూర్తిగా వ్యవసాయ కూలీలను విస్మరిస్తున్నాయన్నారు. వ్యవసాయ రంగం లో యాంత్రికరణ వల్ల కూలీలకు పని దొరకక పస్తులు ఉంటున్నారన్నారు. ప్రధాని మోడీ కూలీల పొట్ట కొట్టడానికే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారని, కూలీలు అంటేనే ప్రధాని మోడీకి చిన్నచూపు చూస్తూన్నారని వాపోయారు.
వికసిత్ భరత్ అంటున్న ప్రధాని మోడీ వ్యవసాయ కూలీలకోసం ఏ ఒక్క పథకం చెపట్టిన దాఖలా లేదన్నారు. తమ హక్కుల కోసం కూలీలు వీధుల్లోకి వచ్చి కొట్లాడాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభలను కామారెడ్డిలోని విక్లీ మార్కెట్ లో జరిగే బహిరంగ సభలో ఇల్లందులో 5 సార్లు ఎంఎల్ఏగా గెలిచినా మాజీ ఎంఎల్ఏ గుమ్మడి నర్సయ్య ముఖ్యఅతిథి గా హాజరై ప్రారంభిస్తారన్నారు. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పీ రంగారావు, నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వీ ప్రభాకర్ ప్రసంగిస్తారన్నారు.
రెండో రోజు 25న, ప్రతినిధుల సభ మున్నూరు కాపు సంఘం కళ్యాణమండపంలో జరగనున్నదని, ఈ ప్రతినిధులసభను ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావు ప్రారంభిస్తారన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పీ విజయరామరాజు, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్ ప్రసంగిస్తరన్నారన్నారు. మహాసభలలో జరిగిన కార్యక్రమాల రిపోర్ట్స్ పై రివ్యూ, భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించడం, నూతన కార్యవర్గం ఎంపిక ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఈ గంగాధర్, ఏఐపీకేఎంఎస్ మండల నాయకులు కే రామన్న, గట్టు కిరణ్, జే రాజు, ఎస్కే రపిక్, షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

