కోటగిరి/ నిజామాబాద్ రూరల్/ఇందల్వాయి/డిచ్పల్లి/ మాక్లూర్/ ఆర్మూర్/ భీమ్‌గల్/ ముప్కాల్/ ఆలూర్/ డొంకేశ్వర్/ నవీపేట, ఏప్రిల్ 21: జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు.మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, గంగరమంద, వేణుకిసాన్నగర్ తండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచులు పుప్పాల లక్ష్మీ, గంగాధర్, రమేశ్‌నాయక్, ఎంపీటీసీలు మంథెన సత్యనారాయణ, లలిత, లక్ష్మి, కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కోటగిరి మండలం పొతంగల్ విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో దోమలెడ్గి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పొతంగల్ విండో డైరెక్టర్ చిన్న పోచయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయరాణీ దిగంబర్పటేల్, ఎంపీటీసీ అనంత విఠల్ పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం సొసైటీ పరిధిలో ఉన్న కాలూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ దాసరి శ్రీధర్, ఉపాధ్యక్షుడు సత్యంరెడ్డి, నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్ ప్రారంభించారు. మల్లారం గ్రామంలో ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, సొసైటీ చైర్మన్ పైసా స్వామి, సర్పంచ్ నగేశ్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో సొసైటీ సీఈవోలు అనంతలక్ష్మి, నంబూద్రిఫాగ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల శంకర్, వీడీసీ చైర్మన్ పోల శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్లు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రమేశ్ నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాస్, సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఖిల్లా డిచ్పల్లి, దూస్‌గాం, ఘన్పూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను విండో చైర్మన్ గజవాడ జైపాల్.. ఎంపీపీ గద్దె భూమన్నతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, శక్కరికొండ కవిత, ఎంపీటీసీలు కొత్తూరు మానసాసాయి, కుర్రి సవితా రామకృష్ణ, సీఈవో కిషన్, సొసైటీ వైస్‌చైర్మన్ కుమ్మరి చిన్న గంగారాం, డైరెక్టర్లు బూస చిన్ననర్సింలు, పడిగెల గంగారెడ్డి, సతీశ్‌రెడ్డి, లంబాని హరిచంద్, యెడ్ల శ్యామ్సోన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పట్టణంలోని పిప్రి రోడ్డులో, పెర్కిట్ బైపాల్ రోడ్డు వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్, మెప్మా పీడీ రాములు ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, డీఈ భూమేశ్వర్, మెప్మా డీఎంసీ ఉదయశ్రీ, నీలిమా, అనురాధ, మారియా, అన్నపూర్ణ, సీవోలు సంతోష్, రాజలింగం పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలం పిప్రి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పిప్రి, అమ్ధాపూర్, మగ్గిడి గ్రామాల్లో సంఘం చైర్మన్ సోమ హేమంత్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండా లింగన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు భోజన్న, సీఈవో హన్మాండ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలోని బాచన్పల్లి, రహత్‌నగర్, కొత్తతండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ చౌట్పల్లి రవి, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ మలావత్ వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మానాయక్, ఏఎంసీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముప్కాల్ మండలం వేంపల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ జక్క రాజేశ్వర్ ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ వెంకట్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, వేంపల్లి ఉప సర్పంచ్ జక్క గంగాధర్, సొసైటీ డైరెక్టర్లు నేర బాబురావు, మల్కన్న, సెక్రటరీ పాల్గొన్నారు.
ఆలూర్ మండల మిర్దాపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ చిన్న ముత్తెన్న ఉప సర్పంచ్ సౌడ మధువర్మతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు తుమ్మల నవీన్, ఉపాధ్యక్షుడు మహ్మద్ షాదుల్లా, సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
డొంకేశ్వర్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రవీందర్, సొసైటీ చైర్మన్ భరత్‌రాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ చాయ, చందు, డైరెక్టర్లు, పెంటన్న, రాజన్న, లిప్ట్ చైర్మన్ బార్ల నర్సారెడ్డి, వైస్ చైర్మన్ పెద్దన్న, సొసైటీ సెక్రటరీ కృష్ణ, సెంటర్ ఇన్చార్జి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
నవీపేట మండలంలోని ఆభంగపట్నం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం భూమేశ్వర్గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలం అంబం గ్రామంలో పెంటకలాన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాజరెడ్డి, సర్పంచ్ గంగా ప్రసాద్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సొసైటీ డైరెక్టర్ ఒడ్డన్న, సెక్రటరీ బాబా తదితరులు పాల్గొన్నారు.