మాక్లూర్ : నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా మాక్లుర్ మండలం అమ్రాద్ తండాలో కత్తిపోట్ల (Stabbing ) ఘటన కలకలం రేపుతుంది. శనివారం మధ్యాహ్నం తండాలోని రేషన్ షాప్ వద్దకు వచ్చిన తండా వాసి భూక్యా రమేష్ అలియాస్ విక్రమ్ రేషన్‌డీలర్( Ration Dealer ) సునీత వద్దకు వచ్చి గొడవకు దిగాడు. సమాచారం అందుకున్న డీలర్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి రాగా రమేష్ వారిపై కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో రేషన్ డీలర్ భర్త జ్యోతిరామ్తో పాటు అతడి సోదరులు శ్రీనివాస్, రాజు గాయపడ్డారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో నిజామాబాద్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.