ఖలీల్వాడి : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు (SSR Students) సోమవారం బొటానికల్ టూర్ లో భాగంగా హైదరాబాద్లోని ఇక్రిశాట్ (ICRISAT) సందర్శించారు. కళాశాల విద్యార్థుల్ల సైన్స్, రిసోర్స్ పరిజ్ఞానం పెంపొందించేందుకుగాను ఇక్రిశాట్ను సందర్శించామని డాక్టర్ కల్పన తెలిపారు. పంట పొలాలపై రీసెర్చ్ గురించి నిశితంగా వివరించారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు నవీన్ ,సంతోష్, శ్రావణి, ఝాన్సీ కృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.