బాన్సువాడ : విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాజిక సేవకుడు, ఏఎస్ఆర్ ఫౌండేషన్(ASR Foundation,) చైర్మన్ మొహరిల్ శ్రీనివాస్ రావు అన్నారు. అదివారం బాన్సువాడలో గల సాయి కీర్తి జూనియర్ కళాశాలలో టీజీ సెట్ మోడల్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ టెస్ట్ రాసిన విద్యార్థులు ఇంటి వద్ద కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలన్నారు. విద్యార్థుల తల్లి దండ్రులు కూడా టీవీలకు, సెల్‌ఫోన్స్‌కు దూరంగా ఉండాలని, పిల్లలు చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనేక గురుకులాలు ఏర్పాటు చేశాయన్నారు. పేద పిల్లల కోసం 5 వ తరగతి నుంచి డిగ్రీ వరకు BC, SC, ST, మైనారిటీ వర్గాల కోసం అనేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసిందని, వాటిని వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం మోడల్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థపాకులు అయ్యాల సంతోష్, ఫౌండేషన్ సభ్యులు కల్లూరి రాజారాం, రోటే సాయిలు, పర్వయ్య, నాగరాజు, మన్నే సాయిలు, తదితరులు పాల్గొన్నారు.