Silver Jubilee Celebrations | బోధన్, ఫిబ్రవరి 25 : బోధన్ పట్టణంలోని విజయసాయి ప్రాథమిక పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్పశాయి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేషతల్పశాయి మాట్లాడుతూ.. విజయసాయి ప్రైమరీ స్కూల్లో చదివిన ఎంతోమంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఇందుకు కారణం ఈ పాఠశాలలో పిల్లలకు అంకితభావంతో విద్యాబోధన చేయటమేనన్నారు.
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ వారిని క్రమశిక్షణతో పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న బోధన్ ఎంఈఓ నాగయ్య మాట్లాడుతూ.. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా ఉపాధ్యాయులు తీసుకునే చర్యల విషయంలో తల్లిదండ్రులు సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు. ఈ పాఠశాలలో తన కుమారుడితోపాటు చదువుకున్న అనేకమంది దేశంలోనూ, అమెరికాలోనూ స్థిరపడ్డారన్నారు. చక్కటి విద్యాబోధనను అందిస్తున్న విజయసాయి ప్రైమరీ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.
బోధన్ టౌన్ సీఐ వెంకటరమణ మాట్లాడుతూ.. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, చిన్న వయసులో గంటల తరబడి సెల్ ఫోన్లు చూడటం వల్ల వారి మేధస్సు వికసించదని అన్నారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సాదియా ఫాతిమాకు ప్రశంసాపత్రాన్ని అందించి అభినందించారు. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సాగిరాజు కల్పన, హైస్కూల్ విభాగం ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణమోహన్, మేనేజర్ రాజశేఖర్ (రాజు), విజయసాయి విద్యాసంస్థల ప్రతినిధులు ఐఆర్ చక్రవర్తి, సువర్చల, ప్రసూన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!