Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కల్యాణ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా ప్రతీ నెల మాస కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం లో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధణ, సుదర్శన పూజ వాసుదేవ పుణ్యావచనము శ్రీవారి కంకణ ధారణ ప్రవరలు తదితర కార్యక్రమాలను జరిపించారు అనంతరం మధుపర్క సమర్పణ, వస్త్ర సమర్పణ, కల్యాణాష్టకం, కన్యాదానం, మాంగల్య పూజ, మాంగళ్యధారణ అనంతరం కార్యక్రమాలను శశాస్త్రీయంగా జరిపించారు.
ఇట్టి కార్యక్రమాలను యాగ్నీకులు కలకుంట్ల శ్రీధరాచారి మంత్రోచ్ఛారణలతో ఆలయ అర్చకుడు దీపక్ పాండే సహకారంతో జరిపించారు. ఈ వివాహ వేడుకల్లో యజమానులుగా రాజు పటేల్, గోవర్ధనం చంద్ర ప్రకాష్ ఆండాలు, గాదే వెంకటరమణారావు దుర్గా లక్ష్మి, అమృతం వినోద కాశీనాథ్ దంపతులు వ్యవహరించారు. కళ్యాణోత్సవం శాస్త్రీయంగా, మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 9 గంటల నుంచి సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. కల్యాణోత్సవానికి స్థానికులతో పాటు చుట్టుపక్క గ్రామాలకు చెందిన పలువురు భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.