మోర్తాడ్, ఏప్రిల్ 6: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతున్నది. ఈనెల 9 ఉదయం 6గంటల వరకు ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగిస్తుండడంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నది.
ఇంకా మూడు రోజుల పాటు నీటి విడుదల కొనసాగనున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో కేవలం 1063అడుగుల(13.601టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు 3500 క్యూసెక్కులు, లక్ష్మీకాలువకు 250, అలీసాగర్ ఎత్తిపోతలకు 240, గుత్ప ఎత్తిపోతలకు 300, సరస్వతీకాలువకు 700, మిషన్‌భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.