Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కోటగిరి శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పోలా విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచామృతం అభిషేకాలతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ రావు గుప్తా మాట్లాడుతూ కోటగిరి అయ్యప్ప దేవాలయంలో స్వామి వారి జన్మదిన వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమానికి చాలా మంది దాతలు, భక్తులు సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. గణపతి కుమారస్వామి అయ్యప్పకు అభిషేకాలు నిర్వహించి, పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిశాంత్, పోల అశ్విన్, బర్ల సత్యనారాయణ, పి సాయిలు తదితరులు పాల్గొన్నారు.