SR Foundation | బిబిపెట్, మే 15 : ఎస్ఆర్ ఫౌండేషన్ (విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సహకారంతో ) జనగామ గ్రామానికి చెందిన భ్యాగరి జ్యోతి వివాహానికి గురువారం రూ..25వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. తల్లిదండ్రులను కోల్పోవడంతో తను తల్లి తండ్రియై ముగ్గురి చెల్లెళ్ళ వివాహం జరిపించిన తరువాత చివరిగా జ్యోతి వివాహం చేసుకున్నట్లు తెలిపారు.
కాగా తను ముగ్గురి చెల్లెళ్లకు ఆదర్శంగా ఉండడం సంతోషకరమని ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కప్పేర రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, సాయికుమార్, అశోక్, శేఖర్, స్వామి, ప్రవీణ్ మరియు ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.