బాన్సువాడ రూరల్ : బాన్సువాడ (Banswada) మండలంలోని దేశాయ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడా పోటీలను (Sports ) ప్రిన్సిపాల్ వేణుగోపాలస్వామి శుక్రవారం ప్రారంభించారు. కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను (Silver Jubilee Celebrations) నిర్వహించేందుకు కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. విజేతలకు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బహుమతులను ప్రధానం చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.