మోర్తాడ్/బోధన్ రూరల్/ మాక్లూర్/ వేల్పూర్/నందిపేట్/రెంజల్/ఎడపల్లి/ఇందల్వాయి, డిసెంబర్3: మోర్తాడ్‌లోని భవిత భవనంలో శనివారం నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవానికి ఎంపీపీ శివలింగుశ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగ పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించారు. ఎంఈవో ఆంధ్రయ్య, సర్పంచ్ బోగధరణి, కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కమ్మర్‌పల్లిలోని భవిత భవనంలో దివ్యాంగ విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. హెచ్ఎం రాజేశ్వర్, ఎస్ఎంసీ చైర్మన్ నర్సయ్య పాల్గొన్నారు.
బోధన్ మండలంలోని భవిత కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో మధుకర్, రాజేశ్వర శర్మ, ఐఈఆర్పీలు లక్ష్మణ్, నరేందర్ పాల్గొన్నారు.
మాక్లూర్ మండలం మాదాపూర్ భవిత సెంటర్లో దివ్యాంగులకు పోటీల్లో నిర్వహించి బహుమతులను అందజేశారు. ఎంపీడీవో జైక్రాంతి, ఉప సర్పంచ్ శశికుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీహరి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయులు అనుపమ, నాగరాజు, రాధిక, రమ పాల్గొన్నారు.
వేల్పూర్ మండల విద్యావనరుల కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ఎంఈవో వనజారెడ్డి బహుమతులను అందజేశారు. ఐఆర్పీలు శైలజ, మౌనిక, ఫిజియోథెరపిస్టు నాగేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నందిపేట్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు (దివ్యాంగులకు) క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీవో నాగవర్ధన్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్.కొండూర్ సర్పంచ్ ప్రభాకర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కిషన్, రిసోర్స్‌పర్సన్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
రెంజల్, డిసెంబర్ 3: సాటాపూర్ భవిత పాఠశాల అవరణలో దివ్యాంగులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. రైల్వే, బస్ పాస్‌లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌పాషా, ఎంఈవో గణేశ్‌రావు, ప్రత్యేక అవసరాల హెచ్ఎం విశ్వనాథ్, ఎస్ఎంసీ చైర్మన్ నరేశ్ పాల్గొన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం సాయిలు, భవిత కేంద్రం ఉపాధ్యాయుడు రాజేశ్ పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలకేంద్రంలో దివ్యాంగులు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రూరల్ కన్వీనర్ కుంట మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇమ్మడి సాయిలు, మహిళా విభాగం అధ్యక్షురాలు అబ్బవ్వ, సభ్యులు జమున, శ్రావణ్‌గౌడ్, కుమ్మరి రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిర్మన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీడీవో రాములు నాయక్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, సురేశ్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వేణు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.