వేల కోట్లతో ఆలయాల అభివృద్ధి
వేలకోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 51 విగ్రహాలతో మోస్రా మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దేవీ మండపాన్ని మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు బతుకమ్మ ఆడగా తిలకించారు.
- స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
మోస్రా (చందూర్), అక్టోబర్ 17: వేలకోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వవైభవం తెచ్చామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. 51 విగ్రహాలతో మోస్రా మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన దేవీ మండపాన్ని మంగళవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మహిళలు బతుకమ్మ ఆడగా తిలకించారు.
మార్కెట్ పక్కన నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. అనంతరం రామాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎంపీపీ పిట్ల ఉమ కాలుకు చికిత్స చేసుకోగా, శాసన సభాపతి పరామర్శించారు. స్పీకర్ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ పిట్ల శ్రీరాములు, పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, ఎంపీటీసీ మమత, సర్పంచులు సుమలతా రాంరెడ్డి, నరేందర్‌రెడ్డి, విమలా లింగయ్య, సాయారెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నేడు దుర్గామాత పూజల్లో పాల్గొననున్న స్పీకర్
కోటగిరి, అక్టోబర్ 17: పొతంగల్ మండల కేంద్రంలోని దుర్గామాత పూజల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా బుధవారం పాల్గొంటారని బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

