Soya procurement | పొతంగల్ అక్టోబర్ 11: సోయా కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరుతూ పొతంగల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఇన్చార్జి కార్యదర్శి శివాజీకి శనివారం మండలంలోని సుంకిని గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోయాబీన్ పంట చేతికొచ్చి 20 రోజులు గడుస్తున్న ప్రభుత్వం కొనుగోలు చేసే ఉసేలేదని మండిపడ్డారు.
ఈ ఏడాది భారీ వర్షాలతో పంటలు నష్టపోయి దిగుబడి లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నామని,ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి. రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు. సోయ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేస్తే చేతికి వచ్చిన పంట నిలువ చేసే సౌకర్యం లేక తర్వాత పంట పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.
ప్రభుత్వం స్పందించి వెంటనే సోయా కొనుగోల్లు ప్రారంభించలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగనాథ్,మాధవరావు,లక్ష్మణ్, రమేష్,నగేష్,సచిన్, లక్ష్మణ్, శంకర్,రావ్ సాబ్, రాజేందర్, నగేష్ తదితరులు ఉన్నారు.