గాంధారి : కామారెడ్డి (Kamareddy) జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలోని సాయిబాబా ఆలయ (Saibaba Temple ) 6వ వార్షికోత్సవ వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Surendhar) పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గౌరారం గ్రామానికి చెందిన న్యాయవాది దుర్గారెడ్డి దంపతులు, సాయిబాబా పై గల భక్తితో గ్రామంలో ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని అన్నారు.
ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కర్త దుర్గారెడ్డి, ముదేల్లి విండో చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం, బీఆర్ఎస్ నాయకులు శ్రీను నాయక్, మహేందర్ రెడ్డి, తూము అంజయ్య, గాజుల అంజయ్య,రోడ్డోల గంగాధర్, దొల్లు సాయిలు,సయ్యద్ ముస్తఫా, బొల్లారం రమేష్, ప్రకాష్ గౌడ్, బాలరాజు, పండిత్ తదితరులు పాల్గొన్నారు.