బాన్సువాడ రూరల్ : ఉపాధి హామీ పథకంలో (Employment Guarantee) అవినీతి జరగకుండా, జరిగిన అవినీతిని వెలికి తీసేందుకే సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నామని డీఆర్డీవో ఏపీడి వామన్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ (Social Audit ) మండల ప్రజా వేదికలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండలంలో జనవరి 2023 నుంచి మార్చి 2024 వరకు జరిగిన 227 పనులకు గాను కూలీలకు చెల్లించిన రూ. 3.89 కోట్ల వేతనాలను చెల్లించింది. ఇందులో భాగంగా సామాజిక తనిఖీ బృందం గత వారం రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ చేపట్టిన సామాజిక తనిఖీ వివరాలను ప్రజావేదికలో వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, ఎస్ఆర్పీ మహేష్, ఏపీవో బిక్షపతి, టీఏలు గంగాధర్,గోపాల్, సంతోష్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.