కామారెడ్డి, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు, పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మారుమూల జిల్లాల్లోని మహిళలు పౌష్టికాహార లోపం తో బాధపడుతున్నారని సర్వేలో గుర్తించిన ప్రభు త్వం.. గర్భిణులు, గర్భంలోని శిశువు రక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని అమలు చేసిం ది. గతేడాది డిసెంబర్లో ప్రవేశపెట్టిన ఈ పథకం తో గర్భిణులకు ఎంతో మేలు చేకూరుతున్నది. ఈ కిట్ ద్వారా గర్భిణులకు విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు అందుతున్నా యి. రూ.2 వేల విలువ చేసే ఈ కిట్‌ను గర్భిణులకు రెండు సార్లు (5వ, 9వ నెలలో) అందిస్తున్నారు.
మహిళా ఐఏఎస్ అధికారులతో అధ్యయనం
గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో నివసించే మహిళలు తీవ్రమైన రక్తహీనతను ఎదుర్కొంటున్నారని గుర్తించిన ప్రభుత్వం.. సమస్యను పరిష్కరించేందుకు మహిళా ఐఏఎస్ అధికారిణుల ద్వారా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేయించింది. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూతో సహా 9 మంది మహిళా ఐఏఎస్ అధికారులు తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో పర్యటించి అక్కడ గర్భిణు ల కోసం అందిస్తున్న పథకాలను పరిశీలించారు. నివేదికలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను రూపొందించారు.
కిట్‌లో ఉండే వస్తువులు..
రూ.2వేల విలువ చేసే ఈ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్డ్ పౌడర్ (హార్లిక్స్) రెండు బాటిళ్లు, కిలో ఖర్జూర, 500 గ్రాముల నెయ్యి, 3 బాటిళ్ల ఐరన్ సిరప్, అల్బెండజోల్ ట్యాబ్లెట్లు, ప్లాస్టిక్ బుట్ట, కప్పును అందిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలోనే పథకం ప్రారంభం..
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతేడాది డిసెంబర్ 21న లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని మరో 8 జిల్లాల్లో సైతం ఈ పథకాన్ని ప్రారంభించారు. 9 జిల్లాల్లోని 205 ఆరోగ్య కేంద్రాల ద్వారా 1.50 లక్షల మంది గర్భిణులకు కిట్లను అందించేందుకు రూ.50 కోట్లతో సుమారు 2,29,952 న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. మొదటి 14 వారాల నుంచి 27 వారాల వరకు పీహెచ్సీ పరిధిలో, రెండో విడుతలో 28 వారాల నుంచి 34 వారాల వరకు ఏరియా, జిల్లా దవాఖానల్లో కిట్లను అందజేస్తున్నారు. గత డిసెంబర్ నుంచి మే వరకు జిల్లాలో మొత్తం 13,333 కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం అందించగా.. వాటిలో 10,447 కిట్లను గర్భిణులకు పంపిణీ చేశారు. ఇంకా 2886 కిట్లు వైద్య ఆరోగ్య శాఖ వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం
గర్భిణులకు ఎప్పుడు ఏం అవసరముంటుందో ఆ అవసరాన్ని తీరుస్తూ సీఎం కేసీఆర్ మాకు అండగా ఉంటున్నారు. ఆయనకు రుణపడి ఉంటాం. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌తోపాటు నగదు సహాయం చేస్తూ ఆదుకుంటున్నడు. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా పోషక విలువలు గల వస్తువులను కొనుగోలు చేయడం కష్టమవుతుండె. మాకు రెండు సార్లు కిట్‌ను ఇచ్చి ఆదుకున్నారు.
–మంగపల్లి మౌనిక, లబ్ధిదారు, కామారెడ్డి
జిల్లాలో విజయవంతం
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కామారెడ్డి జిల్లాలోనే ప్రారంభించారు. ఈ పథకం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 10 వేల కిట్లను గర్భిణులకు అందజేశాం. ఇంకా పంపిణీకి కిట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ కిట్లతో గర్భిణులు ఆరోగ్యవంతులై అనీమియా బారిన పడకుండా ఉంటారు. జిల్లాలో ఈ పథకానికి మంచి స్పందన లభిస్తున్నది.
– డాక్టర్ లక్ష్మణ్ సింగ్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి