నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకి బాయి చెరువు కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మత్తడి దుంకుతూ.. సరికొత్త అందాలను సంతరించుకొని చూపురులను ఆకట్టుకుంటున్నది.
30 అడుగుల ఎత్తు నుంచి కిందకు దుంకుతున్న వరద నీరు చూపురులను మంత్రముగ్దుల్ని చేస్తున్నది. గ్రామంలోని పిల్లల నుంచి పెద్దలకు వరకు మత్తడి వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.