కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి (Kotagiri) మండల కేంద్రంలో సోమవారం నల్ల పోచమ్మ ( Nalla Pochamma ) విగ్రహ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి మంత్ర విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నల్ల పోచమ్మకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ గుడి వద్ద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.