నిజామాబాద్( ఖలీల్‌వాడి ) : పాఠశాలకు సమయానికి రాని నలుగురు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ షోకాజ్ నోటీసులు (Show cause notices ) అందజేశారు. గురువారం నిజామాబాద్(Nizamabad) నగరంలోని వినాయకనగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్కూల్ ప్రారంభ సమయానికి రాని నలుగురు టీచర్స్ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డీఈవో తెలిపారు. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు .