నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 13 : మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్.నాగరాజు అన్నారు. కమిషనరేట్ కా ర్యాలయంలో మంగళవారం షీ అంబాసిడర్ల నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2015 నవంబర్‌లో నిజామాబాద్ జిల్లాలో షీ టీమ్స్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం సమాజంలో చాలామంది మహిళలు, చిన్నారులపై అఘాయిత్యా లు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరా లు, ఆన్లైన్ వేధింపులు, బ్లాక్ మెయిల్‌లాంటి సంఘటనలపై ప్రత్యేక దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం 50 పాఠశాలల నుంచి ఇద్దరు చొప్పున సైబర్ అంబాసిడర్లను ఎంపి క చేశామని తెలిపారు. వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించామన్నారు.
నిజామాబాద్ జిల్లాలో కళాశాలల్లో చదివే విద్యార్థినుల కోసం 30 కాలేజీల నుం చి ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని, ఒక లెక్చరర్ ఉండేలా షీ అంబాసిడర్ల బృందాలను సిద్ధం చేశామని సీపీ వెల్లడించారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, ఇతర పిల్లలకు ఎదురయ్యే ఆన్లైన్ వేధింపులు, సైబర్ స్పేస్‌లో గోప్యత ఎలా పాటించడం, ఈవ్‌టీజింగ్ గురించి ఈ అంబాసిడర్లు ఇతరులకు తెలియజేస్తారని అన్నారు.మహిళల రక్షణ విభాగంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాకు 3వ స్థానం దక్కిందన్నారు. అంబాసిడర్లుగా ఉండేందుకు ముం దుకు వచ్చిన విద్యార్థినులను సీపీ అభినందించారు. ఎవరైయిన వేధిపులకు పాల్పడితే డయల్ -100, షీ టీమ్ వాట్సాప్ నంబర్ 94906 18029, నిజామాబాద్ ఇన్చార్జి ఎస్సై 99639 39020, ఆర్మూర్ 9440140022, బోధన్ 97046 80260 నంబర్లతో పాటు ఫేస్ బుక్ sheteam.nizamabad కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, షీ టీమ్స్ ఎస్సైలు అబ్దుల్ రషీద్, ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రావు, రేఖారాణి, హరితారాణి, నాగరాజు, విఘ్నేష్, సుమతి, సౌకత్ బేగం, లెక్చరర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.