వినాయక్‌నగర్, ఏప్రిల్ 5: నగరంలోని మాలపల్లిలో ఏడు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జి, అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో మాలపల్లిలో శనివారం దాడులు నిర్వహించారు.
ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల విలువ చేసే ఏడు టన్నుల పీడీఎస్ బియాన్ని స్వాధీనం చేసుకొని, డ్రైవర్ షేక్ ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీని సీజ్ చేసి, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. దాడిలో ఇన్స్పెక్టర్ అంజయ్య, సిబ్బం ది పాల్గొన్నారు.