Peddakodapgal | పెద్దకొడప్గల్ రైతు వేదికలో విత్తన మేళా..!
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Peddakodapgal | పెద్ద కొడప్ గల్, జూన్ 25 : పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం లోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతులకు నాణ్యమైన పెసర, మినుము, కంది విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కిషన్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి సాగు చేయాలని సూచించారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే ఖరీఫ్ సీజన్లో సాగుకు అనువైన పంటలు, విత్తన రకాలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.
విత్తన మేళాలో వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శించి రైతులకు అందుబాటులో ఉంచారు. రైతులు తమ సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు శామప్ప పటేల్, నాగిరెడ్డి, బస్వరాజ్ దేశాయ్, వివిధ గ్రామాల సర్పంచులు,వ్యవసాయ విస్తరణ అధికారులు ఉత్తమ్,స్వాతి, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

