CP Sai Chaitanya | బక్రీద్ సందర్భంగా ఈద్గా వద్ద బందోబస్తు.. సీపీ సాయి చైతన్య
బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద ప్రత్యేక పికెట్లతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు
- ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి
- ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేక పికెటింగ్
- సిబ్బందికి పోలీస్ కమిషనర్ ఆదేశాలు
CP Sai Chaitanya | వినాయక నగర్, జూన్ 7 : బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదు ల వద్ద ప్రత్యేక పికెట్లతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా నిజామాబాదు లోని శాంతి నగర్ ఈద్గా, బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు ఈద్గాలను పోలీస్ కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీపీతో పాటు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, బోధన్ ఏసీపీ పీ శ్రీనివాస్, CCRB ఏసీపీ రవీందర్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

