కోటగిరి/ఖలీల్‌వాడీ/ వర్ని/ రెంజల్/ ఎడపల్లి, మార్చి12 : ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కోటగిరి మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా కవితపై నోటికి వచ్చినట్లు మాట్లాడిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, కోటగిరి విండో చైర్మన్ కూచి సిద్ధు, ఏఎంసీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్, సీనియర్ నాయకులు పి.సాయిలు, బర్ల మధు, తేళ్ల అరవింద్, సలీం, బీర్కూర్ సంతోష్, కొయిగూర్ శ్రీనివాస్, వోలె లింగప్ప, ఆనంద్, ఫారూఖ్, గోపు సాయిలు, మిర్జాపురం చిన్న సాయన్న, కాలే సాయిలు, బేగరి రాములు, పాల గంగారాం పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ని అరెస్టు చేయాలని కోరుతూ పోలీసు స్టేషన్లో వర్ని మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కల్లాల్గిరి, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, వైస్‌ఎంపీపీ బాల్‌రాజ్, కోఆప్షన్ సభ్యుడు కరీం, నమాల సాయిబాబా, శ్రీహరి, నగేశ్ తదితరులు ఉన్నారు.
రెంజల్ మండలం కళ్యాపూర్ – నవీపేట ప్రధాన రోడ్డుపై మండల బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. దిష్టి బొమ్మతో ప్రధాన వీధుల గుండా శవ యాత్ర నిర్వహించారు. తెలంగాణ ద్రోహి బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. రెంజల్ పోలీస్ స్టేషన్లో మండలాధ్యక్షుడు శేషుగారి భూమారెడ్డి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కాశం సాయిలు, పార్టీ మైనార్టీ జిల్లా నాయకుడు రఫిక్, బాగేపల్లి సర్పంచ్ సాయిలు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు హాజీఖాన్, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా, నీలా, రెంజల్ విండో చైర్మన్లు ఇమ్రాన్బేగ్, మొహినుద్దీన్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం కేంద్రంలోని శాటాపూర్ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.