చదువుకునే రోజుల్లో అనేక చిలిపి పనులు, మధుర జ్ఞాపకాలను మిగిలిస్తాయి. అదే చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులందరూ 38ఏండ్ల తర్వాత ఒకేచోట కలుసుకుంటే ఆ ఆనందానికి వెలకట్టలేము. అలాంటి మధుర జ్ఞాపకాలకు వేదికయ్యింది బోధన్. పట్టణంలోని బీటీ నగర్ ఉన్నత పాఠశాలలో 1986-87వ సంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో సుమారు 38ఏండ్ల అనంతరం కలుసుకున్న వారు విద్యార్థి దశ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. నాడు తమకు చదువు చెప్పిన గురువులు పోచాద్రి, వెంకట సుబ్బయ్యలను ఘనంగా సన్మానించారు.