Baseball | సిరికొండ, ఏప్రిల్21 : ఇండియా స్కూల్ గేమ్స్ బేస్ బాల్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 26 వరకు న్యూఢిల్లీ లోని చత్రసాల్ స్టేడియంలో జరిగే 68వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు సత్యశోధక్ పాఠశాల విద్యార్ధి జి.సాయికిరణ్ ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య తెలిపారు.
గత సంవత్సరం నవంబర్ 16 నుండి 18 వరకు ఎన్టీఆర్ స్టేడియం నిర్మల్ జిల్లాలో జరిగిన 68వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అండర్-17 బేస్ బాల్ పోటీలలో జిల్లా జట్టును ప్రథమ స్థానం నిలుపుటలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాయికిరణ్ జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య జి .సాయికిరణ్ ను పాఠశాలలో ప్రత్యేక జ్ఞాపికతో అభినందించారు.
అనంతరం నర్సయ్య మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలలో రాణించి రాష్ట్రజట్టు విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి, విద్యార్ధి తండ్రి బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.