Sardar Sarvai Papanna | రెంజల్, ఆగస్టు 18 : రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న 3 75 వ జయంతివేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్వాయి ఆశయ సాధన కోసం పాటుపడాలని మండల గౌడ సంఘం అధ్యక్షుడు ఆగంటి సాయిబాబా గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆగంటి సురేందర్ గౌడ్, సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.