బాల్కొండ : సంత్ సేవలాల్ను (Sevalal) , ఆయన మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు. బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామంలో గిరిజనులు నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకల్లో హోమయజ్ఞంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంత్ సేవాలాల్ కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండలాధ్యక్షుడు రేగుంట దేవేందర్, బోగ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.