డిచ్పల్లి, జూన్ 15: తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్‌కుమార్ సుల్తానియాను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు 2021 మే 21న అప్పటి ప్రభుత్వం రెగ్యులర్ వీసీలను నియమించింది. 2024 మే 21తో వారి పదవీకాలం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం, కొత్త వీసీల నియామక ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో ప్రభుత్వం 10 యూనివర్సిటీలకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను జూన్ 15 వరకు ఇన్చార్జి వీసీలుగా నియమించింది. అయితే ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ శాశ్వత వీసీల నియామక ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇన్చార్జి వీసీల పదవీకాలాన్ని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.