కంఠేశ్వర్/ కామారెడ్డి, డిసెంబర్ 24 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకున్నది. సమ్మెలో భాగంగా మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. నిజామాబాద్‌లో బోనాల పండుగ నిర్వహించారు.
సమ్మె శిబిరం నుంచి పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించి, అమ్మవారికి సమర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి మనసు కరిగేలా చూడాలని వేడుకున్నారు. కామారెడ్డిలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ నెల 27 నుంచి టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని వారు తెలిపారు. అనంతరం డీఈవో రాజుకు వినతిపత్రం అందజేశారు.