రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలో గురువారం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, బిగాల గణేశ్ గుప్తా అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు. పలుచోట్ల అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.
వినాయక్‌నగర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బిగాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, మేయర్ నీతూకిరణ్ కామారెడ్డిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ముజీబుద్దీన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు