బాన్సువాడ రూరల్, మార్చి 16 : ప్రతి విద్యార్థి ఒక ఉన్న త లక్ష్యాన్ని ఎంచుకొని, గమ్యాన్ని చేరేవరకూ ప్రయత్నించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఉన్నత రంగాల్లో రాణించాలంటే చదువే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. బాన్సువాడ మండలంలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ. 3 కోట్ల చొప్పన మొత్తం రూ. 6 కోట్ల నిధులతో చేపట్టనున్న ఎస్సీ, బీసీ మహిళా పోస్టు మెట్రిక్ వసతి గృహాల నిర్మాణ పనులకు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో భారీగా నిధులు తీసుకొచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సమాజంలో 80శాతం నిరుపేద, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఈ వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. పేద కుటుంబాల్లో విద్యార్థినులు పాఠశాల, కళాశాల నుంచి ఇంటికి వెళ్తే ఇంటిపని, పొలం పనులు చెప్పడంతో చదువు దెబ్బతింటుందన్నా రు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థినులు ఇక్కడే ఉండి చదువుకునేలా ప్రత్యేకంగా బాలికల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతిపేద విద్యార్థికీ నా ణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమన్నారు. బాన్సువాడ ని యోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని తెలిపారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభు త్వ బాధ్యత అని, కష్టపడి చదువుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సొంత బిడ్డలా చూసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్‌కు భారీగా ఐటీ పెట్టుబడులు, భారీ పరిశ్రమలు వస్తున్నాయని స్పీకర్ తెలిపారు. దాదాపు 8.75లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కేవలం రెండు లక్షలేనని తెలిపారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో దాదాపు 25వేల పరిశ్రమలు నెలకొల్పి రూ.3లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారని వివరించారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 17లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. అనంతరం స్పీకర్, కలెక్టర్‌ను దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, పీఆర్ ఈఈ సమత, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రాంరెడ్డి, నస్రుల్లాబాద్ ఎంపీపీ జన్నూబాయి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, నాయకులు ఏర్వాల కృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాజ్, శ్రీనివాస్ యాదవ్, కిశోర్, ప్రభాకర్, శ్రావణ్‌కుమార్, ప్రశాంత్‌కుమార్, మన్నె చిన్న సాయిలు, మల్లేశ్, ప్రకాశ్, విద్యార్థులు పాల్గొన్నారు.