బాన్సువాడ రూరల్, నవంబర్ 9 : బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో దాదాపు రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదిం చి, భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట, బోర్లం క్యాం పు, జక్కల్‌దాని తండా, కృష్ణానగర్ తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆయనకు మహిళలు, రైతులు, యవకులు ఘన స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పోచారం మాట్లాడు తూ.. గుంట గుంటకు సాగు నీరు అందించేందుకు శ్రీకారం చుట్టి నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు సిద్దాపూర్ రిజార్వాయర్, ఎత్తిపోతల పథకాల ద్వారా నియోజకవర్గంలో 1.50లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నడుంబిగించి సఫలీకృతమైనట్లు తెలిపారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి అయితే 25వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం అవుతాయ న్నారు. రూ.150 కోట్లతో ఎత్తిపోత పథకాలు నిర్మిస్తున్నామని అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. మన రైతు లు పుష్కలంగా పంటలు పండిస్తుండడంతో దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తండాలను పంచాయతీలుగా మార్చి బంజారాలకు స్వయం పరిపాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నియోజకవ ర్గంలో 2100 మంది గిరిజన రైతులకు 4వేల ఎకరాలకు పోడు పట్టాలు అందించామని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే గిరిజనేతరులకు సైతం పోడు పట్టాలు అంది స్తామని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందన్నారు. కొత్త ప్రభుత్వంలో భూమి లేని నిరుపేదలకు సైతం కేసీఆర్ బీమా పథకం కింద రూ.5లక్షలు చెల్లిస్తామన్నారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, రైతులకు పంటపెట్టుబడి కింద ఎకరాకు రూ.12వేలు చెల్లించి రూ.16 వేలకు పెంచుతామని చెప్పారు. అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీల పేరుతో కల్లబొల్లి హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీరు వేసే ఓట్లతో ప్రత్యర్థులకు దిమ్మతిరగాలని అన్నారు. ప్రచారంలో సర్పంచులు నాన్కుబాయి, సంగ్యానాయక్, ప్రేంసింగ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యానాయక్, ఎంపీపీ, జడ్పీటీసీలు దొడ్ల నీరజారెడ్డి, పద్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, ఎంపీటీసీ యశోద, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌నాయక్, రాజేశ్వర్ గౌడ్, నాయకులు దొడ్ల వెంకట్రాం రెడ్డి, గోపాల్‌రెడ్డి, బన్సినాయక్, శ్రీశైలం, రతన్, జెమ్లానాయక్, గణేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, జగ్రాం, పీర్యానా యక్, బాబూసింగ్, నాయకులు పాల్గొన్నారు.
కోటగిరి/నస్రుల్లాబాద్/మోస్రా(చందూర్)/ రుద్రూర్ / బాన్సువాడ టౌన్/బాన్సువాడ రూరల్/ వర్ని, నవంబర్ 9 : నియోజకవర్గంలో గులాబీ దండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడగడపకూ వివరిస్తూ తమ దైన శైలిలో దూసుకెళ్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించనున్నారని ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్ అన్నారు. కోటగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, అనిల్ కులకర్ణి, జుబేర్, హౌగిరావు, సిద్దూ తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని రాములగుట్ట, నాచుపల్లి తండా, నస్రుల్లాబాద్, మైలారం తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నస్రుల్లాబాద్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, ఎంపీపీ విఠల్, సర్పంచ్ గోపాల్, విండో చైర్మన్ సుధీ ర్, నాయకులు పాల్గొన్నారు. మోస్రా మండలం గోవూర్ లో ఇంటింటా బూత్ లెవల్ కమిటీ ప్రచారాన్ని సర్పంచ్ నరేందర్‌రెడ్డితోపాటు కలిసి బీఆర్ఎస్ శ్రేణులు జోరుగా ప్రచారం చేశా రు. ఉప సర్పంచ్ నరేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు.
రుద్రూర్లో బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి సర్వే చేపట్టారు. గడప గడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి పోచారాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పోచారం సురేందర్‌రెడ్డి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, వైస్ ఎంపీపీ సాయిలు, సీనియర్ నాయకుడు నాగేందర్, పార్టీ గ్రామాధ్యక్షుడు గంగారాం, నవీన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కిశోర్, కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్సువాడలోని పదో వార్డులో పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నాయకులు ప్రచారం చేశారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, జ్ఞాన సరస్వతి ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు రమాదేవి, కిరణ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు అనిత, నాయకులు ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామా ల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ దొడ్ల నీరజ, జడ్పీటీసీ పద్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌నాయక్, రాజేశ్వర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ నెర్రె నర్సింహులు, బోర్లం, బుడ్మి సొసైటీల అధ్యక్షులు గంగుల గంగారాం, సంగ్రాం నాయక్, తదితరు లు పాల్గొన్నారు. వర్ని మండలం పాత వర్ని, సత్యనారాయ ణపురం గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగు తుంది. కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్ని మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, నాయకులు సంతోష్ కులకర్ణి, ఎంబడి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.