బీఆర్ఎస్ వస్తే కొత్త బీడీ పింఛన్లు.. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ పాత కష్టాలు
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ తేదీని ఎత్తేసి కొత్తవారికి కూడా బీడీ పింఛన్లు ఇవ్వనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే మళ్లీ పాత కష్టాలు తప్పవన్నారు. పదేండ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మూడోసారి అవకాశం ఇస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
- అవకాశం ఇస్తే రెట్టింపు అభివృద్ధి చేస్తా
- రూరల్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
డిచ్పల్లి, నవంబర్ 19 : బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కటాఫ్ తేదీని ఎత్తేసి కొత్తవారికి కూడా బీడీ పింఛన్లు ఇవ్వనున్నట్లు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోతే మళ్లీ పాత కష్టాలు తప్పవన్నారు. పదేండ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మూడోసారి అవకాశం ఇస్తే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి, నాకాతండా, వడ్డెర కాలనీ, అమృతాపూర్ గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీ గౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి దళిత బంధు, రైతుబంధు తదితర పథకాలను అడ్డుకున్నారని తెలిపారు. రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని, కాంగ్రెస్ వస్తే కరెంటు బాధలు తప్పవని అన్నారు. నాకాతండా గ్రామంలో సర్వీస్ రోడ్డు వేయిస్తానన్నారు. వడ్డెర కాలనీని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయిస్తానని, కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేస్తానన్నారు. అమృతాపూర్‌లో బాజిరెడ్డికి గంగపుత్రులు చేపల వల, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, సర్పంచ్ తారాసింగ్, దండుగుల సాయిలు, ఉప సర్పంచ్ రాజలింగం, మోహన్‌రెడ్డి, యూసుఫ్, నవీన్‌రెడ్డి, పద్మారావు, నవీన్, ఫైజల్ పాషా, రవివర్మ, సాయినాథ్, భాస్కర్, ఆమేర్, కృష్ణ, నల్లవెల్లి సాయిలు, ఒడ్డెం నర్సయ్య, జాకిర్, చింత మహేశ్ పాల్గొన్నారు.
తండాలను జీపీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్దే..
ఇందల్వాయి, నవంబర్ 19 : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులే పాలించుకునే అవకాశం కల్పించిన ఘతన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంతోపాటు రూరల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఇందల్వాయి మండలంలోని చాంద్రాయన్‌పల్లి, దేవీతండా, మెగ్యానాయక్ తండా, రంజిత్‌నాయక్ తండా, చాంద్రాయన్‌పల్లి తండా, గంగారాం తండా, రూప్లానాయక్ తండా, త్రియంబక్‌పేట్ ఇందల్వాయి తండా గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులు, బోనాలు, యువకులు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను ప్రత్యేకంగా సంప్రదించి బంజారాలకు ఎక్కువ మొత్తంలో పోడు పట్టాలు అందిచామన్నారు. ఇంకా భూ సమస్యలుంటే వాటిని కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోమన్, జడ్పీటీసీ గడ్డం సుమనా రవిరెడ్డి, ఎంపీపీ రమేశ్‌నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాసు, ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, ఎస్సీ సెల్ కన్వీనర్ పాశం కుమార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ మోహన్‌నాయక్, విండో చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు ఆరెట్టి రఘు, రాము తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

