Nizamabad | మద్నూర్ : మద్నూర్ మండలంలోని సలాబాత్ పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఆలయంలో ఆయన ఆదివారం ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నియమింపబడ్డ ఆలయ కమిటీ ప్రమాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని, రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాల తో సమానంగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. అందులో భాగంగానే ప్రతీ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు సాయి పటేల్, ఆలయ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధరాస్ సాయిలు, నాయకులు హన్మండ్లు స్వామి, ప్రజ్ఞా కుమార్, శ్రీను పటేల్, గంగాధర్, రమేష్, పరమేష్, రాజు, అమూల్, హనుమంతు యాదవ్, సచిన్, బాలు, రవి, దత్తు, ఆలయ కమిటీ సభ్యులు కైలాష్, శ్రీనివాస్, నాగనాథ్, ఈవో శ్రీధర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.