Students | బిచ్కుంద, ఆగస్టు 01 : బిచ్కుందలోని జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్షేత్ర పర్యటన చేశారు. క్షేత్ర పర్యటనలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి విద్యార్థులను తీసుకెళ్లి వ్యవసాయ పనులపై అవగాహన కల్పించారు. పంట పొలాల్లో వేసిన వరి నాట్లు, వాటిలోని కలుపు మొక్కలు తీసి చూపించారు. కలుపు మొక్కల ద్వారా పంటకు కలిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం బిచ్కుంద మండల పరిధిలోని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అయిన నూనె మిల్లులను పరిశీలించారు. నూనె మిల్లులో కలియతిరిగి విద్యార్థులకు నూనె తీసే విధానం గురించి ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలాజీ, సాయిలు, దిగంబర్, విద్యార్థులు పాల్గొన్నారు.