ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, హన్మంత్‌షిండే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మసీదులు, దర్గాల్లో ముస్లింలు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఈద్గా వద్ద ప్రార్థనలు ముగించిన అనంతరం ముస్లింలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉర్దూ అకాడమీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌కు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పిట్లంలో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎల్లారెడ్డిలో దర్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలకు ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఇతర ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసిన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.