Municipal General Fund | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు మున్సిపల్ అధికారులు మరమ్మతులు జరిపిస్తున్నారు. ముఖ్యంగా బోధన్ కు వచ్చే శక్కర్ నగర్ చౌరస్తా వద్ద రోడ్డు, మోస్రా కు వెళ్లే అనిల్ టాకీస్ రోడ్డు, వర్ని వెళ్లే రహదారిలోని రైల్వే గేట్ వద్ద రోడ్లు గుంతలుగా మారి, ప్రయాణానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలంటే ఇబ్బందితో పాటు, ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు మరమ్మతులకు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా మున్సిపల్ సాధారణ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ ను ప్రారంభించారు. రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు జరిపించడంతో ప్రజలకు, వాహన దారుల ప్రయానానికి సౌలభ్యంగా మారనుంది. ప్రమాదకరంగా మారిన రహదారులకు మారమ్మతులు జరిపించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, డీఈ యోగేష్, ఏఈ సూర్య శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.