నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు, యశోధ హాస్పిటల్‌లోని కార్డియాలిజీ విభాగం సీనియర్ ఇంటర్వెన్షనల్ డాక్టర్‌గా పని చేస్తున్న డా.గోపికృష్ణ రాయిడికి అరుదైన గౌరవం దక్కింది. జర్మనీలో జరిగిన అత్యాధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చే గుండె వైద్యుల పరిశోధనలో ప్రపంచ ప్రఖ్యాత డా.వెర్నార్తో సీటీవో వర్క్ షాప్‌లో పాల్గొని ఘనత సాధించారు.
దేశ వ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధుల నివారణ, చికిత్సలు అందించడానికి అత్యాధునికమైన పరిజ్ఞానాన్ని జర్మనీలో జరిగిన వర్క్ షాప్ లో తెలుసుకున్నారు. డా.వెర్నల్ సలహాలు, సూచనలతో పాటుగా ప్రాక్టికల్ పరిజ్ఞానం దేశీయంగా భారతీయ ప్రజలు, తెలంగాణ వాసులకు గోపికృష్ణ ద్వారా సేవలు అందనున్నాయి. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని డా.గోపికృష్ణను యశోధ హాస్పిటల్ యాజమాన్యంతో పాటుగా వైద్యులు అభినందనలు తెలియజేశారు.